BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
‘దేశాన్ని నలుగురు హైజాక్ చేశారు.. శిక్షపడేలా చేస్తాం’.. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో దిల్లీలో మూడో రోజూ ప్రతిపక్షాల నిరసనలు
"నేరపూరిత కుట్రలతో నరేంద్ర మోదీ, అమిత్ షా, మోహన్ భాగవత్, జ్ఞానేశ్ కుమార్ భారత దేశాన్ని హైజాగ్ చేశారు. రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేశారు. ఓట్లు దొంగలించారు. త్వరలోనే వీరికి శిక్షపడేలా చేస్తాం" అని రాహుల్ గాంధీ అన్నారు.
కాంగ్రెస్‌కు, సీజేపీ మధ్య విభేదాలు ఉన్నాయా? అరవింద్ కేజ్రీవాల్ నిరసనలకు ఎందుకు వెళ్లలేదు?
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరిగిన మార్చ్‌లో ఇండియా కూటమిలోని ఎక్కువ భాగం పార్టీలు పాల్గొన్నాయి. అయితే ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాత్రం దీనికి దూరంగా ఉన్నాయి.
లైవ్, బెంగళూరు నిరసనల్లో అభిజీత్ దీప్కే, ప్రకాశ్ రాజ్, ధ్రువ్ రాఠీ
ప్రధాన ఎన్నికల కమిషర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్బంగా రాహుల్ గాంధీ, ఇతర ప్రతిపక్షనేతలపై పోలీసుల చర్యలను కాంగ్రెస్ ఖండించింది.
రొమ్ము క్యాన్సర్: లక్షణాలు లేకపోయినా టెస్ట్‌లు ఎందుకు చేయించుకోవాలి?
ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలను ప్రపంచవ్యాప్తంగా 'బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్'గా పాటిస్తున్నారు. ఈ నెలలో రొమ్ములో గడ్డ గురించి మాత్రమే కాకుండా... ఎవరికి స్క్రీనింగ్ అవసరం? ఎప్పుడు మామ్మోగ్రామ్ చేయాలి? కుటుంబంలో ఎవరికైనా రొమ్ము కేన్సర్ ఉంటే ఏం చేయాలి? BRCA1, BRCA2 అంటే ఏమిటి? జెనెటిక్ టెస్టింగ్ ఎవరికి అవసరం? ఎంఆర్ఐ ఎవరికి, ఎందుకు చేయాలి? వంటి విషయాలపై అవగాహన పెంచడం అవసరం.
భారత్ రక్షణ సమాచారం పాకిస్తాన్ నిఘా సంస్థలకు అందుతోందా?
విశాఖపట్నం కేంద్రంగా నేవీ సిబ్బంది, పాక్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ల మధ్య రహస్య సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించామని ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ తెలిపింది. ఈ వ్యవహారంపై విజయవాడ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీస్ స్టేషన్లో మూడు కేసులు నమోదు చేశారు.
జెన్ జెడ్, విపక్షాల ఉద్యమం: భారత్‌లో ప్రతిపక్షాల భాష ఎంత వేగంగా మారిందంటే..
ఇప్పటి వరకు భారత్ ఎన్నో పెద్ద ఉద్యమాలను చూసింది. ఈ ఉద్యమాలలో చాలా వరకు సమాజంలోని ప్రతి వర్గాన్ని ప్రభావితం చేశాయి. కానీ, ఈసారి ఉద్యమం ఏమైనా భిన్నంగా ఉందా?
పిడుగు పడిందా, వడగళ్ల వర్షమా? 104 మందితో వెళ్తున్న ఆ విమానం ఎందుకు దెబ్బతింది?
పిడుగు, మెరుపుల వల్ల వచ్చే కరెంట్ విమానం లోపల ఉన్న ప్రయాణికులు, సిబ్బంది, ఎలక్ట్రానిక్ పరికరాలకు చేరకుండా విమానం బయటి పొరను ప్రత్యేకంగా రూపొందిస్తారని వైమానిక నిపుణులు చెబుతున్నారు.
‘గంటకు పైగా సీపీఆర్ చేసినా బతకలేదు’ నానా పాటేకర్ చివరిక్షణాలపై వైద్యులు ఏం చెప్పారు?
నానా పాటేకర్ నుంచి మెసేజ్ అందుకున్న స్నేహితుడు తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆయన ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలో నానా పాటేకర్ తీవ్రమైన చెమటతో తడిసిపోయి నేలపై పడి ఉన్నారు. కేర్ టేకర్ ఆస్పత్రికి వెళ్లి అంబులెన్స్‌ను తీసుకువచ్చారు.
‘‘సుమారు 150 ఏళ్లు ప్రపంచానికి దూరంగా ఒక ద్వీపంలో బతికారు, వాళ్లకు షాపులు, డబ్బులు, టీవీలు, సినిమాలు అంటే ఏంటో తెలియదు’’
"ఇంగ్లండ్‌లో జీవించడానికి డబ్బు కావాలి. కానీ ట్రిస్టన్లో అలా కాదు. డబ్బు లేకపోతే దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. నా దగ్గర డబ్బు లేకపోయినా నా పొలంలో బంగాళాదుంపలు పండించుకోగలను. చేపలు పట్టుకోగలను"
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
ఫీచర్లు
‘‘ఆ ఇల్లు ఆయన ఆలోచనలకు పుట్టిల్లు’’ -వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న గురజాడ నివాసం ఇప్పుడెలా ఉంది?
ప్రజలు మాట్లాడే భాషలోనే సాహిత్యం ఉండాలని చెప్పిన వ్యక్తి జ్ఞాపకాలను పదిల పరచుకున్న ఆ ఇల్లు ఇప్పుడు స్మారక గ్రంథాలయంగా మారింది. అక్కడ ఆయన జీవిత విశేషాలను భద్ర పరిచి ప్రదర్శనకు ఉంచారు.
ఆరుతరాల అరుదైన ఉమ్మడి కుటుంబం: రోజుకు బస్తా బియ్యం, పండగొస్తే 2 పొట్టేళ్లు, 20 కేజీల చికెన్.. కలిసిమెలిసి ఎలా జీవనం సాగిస్తున్నారంటే..
అనంతపురం జిల్లాలో 83 మంది ఒకే ఇంట్లో కలిసిమెలిసి జీవిస్తున్న అరుదైన ఉమ్మడి కుటుంబం కథ ఇది. రోజుకు 50 కేజీల బియ్యం వంట, ఆదివారం వస్తే పొట్టేలు కోయాల్సిందే, సరదాగా బజ్జీలు తినాలంటే 15 కేజీల పిండి సిద్ధం చేయాల్సిందే. ఆధునిక కాలంలో ఎలాంటి విభేదాలు లేకుండా వీరంతా ఎలా కలిసి ఉంటున్నారు? ఆ కుటుంబ సభ్యులు ఏం చెబుతున్నారంటే..
గదర్ పార్టీ: భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ఈ గ్రూప్‌కు, ఇరాన్‌కు ఉన్న అనుబంధం ఏంటి?
"చాలామంది స్వాతంత్ర్య సమరయోధులు తమ భద్రత కోసం ఇరాన్‌కు వెళ్లి అక్కడి నుంచే పోరాటాన్ని కొనసాగించేవారు. షిరాజ్‌లో జరిగిన ఒక ఎన్కౌంటర్ తర్వాత అంబా ప్రసాద్ తన ఎడమ చేతితోనే రివాల్వర్‌ను పట్టుకుని తనపై దాడి చేసిన వారిని ఎదుర్కొన్నారు’’
తాజ్‌మహల్: ప్రేమకు చిహ్నమా, ముంతాజ్ లాంటి మహిళల ప్రాణ త్యాగాలకు చిహ్నమా?
షాజహాన్ ప్రేమకు ప్రతీకగా దీన్ని నిర్మించినప్పటికీ, మాతృ ఆరోగ్య సంరక్షణకు ప్రతీక అయితే ఇంకా బాగుండేదని మద్రాస్ కొరియర్ పత్రిక రాసింది.
సముద్ర గుప్తుడు: 'ఒళ్లంతా బల్లెం, బాణం, ఈటె, కత్తి, గద, గొడ్డలి గాయాలున్న ఈ రాజు ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు'
‘ఉత్తర భారతంలో తొమ్మిది రాజ్యాలను జయించడానికి సముద్రగుప్తుడు ఎంతో దూరదృష్టితో ఆలోచించాడు. ఈ తొమ్మిదిమంది రాజుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించాడు. సైనిక శక్తితో ఈ రాజ్యాలను జయించి, తన సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. కానీ, దక్షిణాదిన తాను జయించిన 12 రాజ్యాలను మాత్రం విలీనం చేసుకునేందుకు ప్రయత్నించలేదు’
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.























































