వీడియో: దక్షిణ ధ్రువాన్ని చేరిన తొలి మహిళా ఐపీఎస్

వీడియో క్యాప్షన్, దక్షిణ ధ్రువాన్ని చేరిన తొలి మహిళా ఐపీఎస్
ప్రచురణ

చేతిలో కర్ర, వీపుమీద 35కేజీల బరువున్న బ్యాగ్‌తో మంచుముద్దలపై నడుస్తున్నారు అపర్ణ కుమార్.

ఉత్తర్ ప్రదేశ్‌ కేడర్‌కు చెందిన 2002 బ్యాచ్ అధికారి అపర్ణ ఐటీబీపీలో డీఐజీగా పనిచేస్తున్నారు. పోలీసు ఉద్యోగంలో చేరిన తర్వాతే పర్వతారోహణను ప్రారంభించారు. గత సంవత్సరమే అపర్ణ ఐటీబీపీలో చేరారు.

దక్షిణ ధ్రువాన్ని చేరిన మొదటి మహిళా ఐపీఎస్ ఆఫీసర్ కూడా అపర్ణే. ఈ సంవత్సరం జనవరి 13న దక్షిణ ధ్రువాన్ని చేరారు. ఏడుగురు సభ్యుల బృందంతో కలసి 8 రోజుల కఠిన ప్రయాణం తర్వాత ఆమె ఈ ఘనత సాధించారు. దీనికోసం అపర్ణ మంచులో 111 కిలోమీటర్లు నడిచారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)