వీడియో: గోదావరి నీటితో తెలంగాణ నేలంతా తడిచేనా? మల్లన్నసాగర్ నిర్వాసితుల గోడు తీరేనా?

వీడియో క్యాప్షన్, వీడియో: గోదావరి నీటితో తెలంగాణ నేల తడిచేనా?
ప్రచురణ

శతాబ్దాల పాటూ ఇక్కడి వ్యవసాయాన్ని నడిపించిన చెరువులు చెదిరిపోయాయి. చెరువులు ఎండిపోయి, బోర్లలో నీళ్లు రాక, గోదారిలో ఎగువ నుంచి నీరు పారక కరవుతో విలవిల్లాడారు తెలంగాణ రైతులు.

"చెరువుల్లో నీళ్లు లేవు. దాంతో, చాలా మంది బోర్లు వేస్తున్నారు. ఆ బోర్లలో నీళ్లు రాక ఎంతోమంది అప్పుల పాలవుతున్నారు" అని జగిత్యాల జిల్లా ఎర్దండి గ్రామానికి చెందిన బెల్లాల నరేశ్ చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత, పరిస్థితి క్రమంగా మారుతోంది. ఈ నది నీటిని ఎత్తి కాలువల్లోకి పోసి ఉత్తర తెలంగాణతో పాటూ, కృష్ణా బేసిన్‌లోని దక్షిణ తెలంగాణకు కూడా నీరు పారించే ప్రయత్నంలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకోసం కాళేశ్వరం ప్రాజెక్టును శరవేగంగా నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టుపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

"2005లో పనికోసం గల్ఫ్‌కు వెళ్లాం. 2015లో వెనక్కి వచ్చాం. ప్రాజెక్టులు పూర్తయ్యి వ్యవసాయానికి ఇక్కడ నీళ్లు వస్తే, ప్రస్తుతం బయటి దేశాల్లో ఉంటున్న కార్మికుల్లో 99 శాతం మంది మా లాగే సొంతూళ్లకు వచ్చేస్తారు" అని జగిత్యాల జిల్లా రామాయంపేట గ్రామవాసి కళ్లెం తిరుపతి రెడ్డి అన్నారు.

కాళేశ్వరంతో పాటూ గోదావరిపై మరికొన్ని ప్రాజెక్టులూ అంతే చురుగ్గా కదులుతున్నాయి.

రిపోర్టర్: దీప్తి బత్తిని, షూట్, ఎడిట్: నవీన్ కుమార్, వాయిస్: అన్సారీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)