కశ్మీర్ లోయలో పూసిన రాజకీయనాయకి మెహబూబా ముఫ్తీ
మీకు తెలుసా.. కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ చెల్లెలు రుబియాను ఒకసారి మిలిటెంట్లు బంధించారు. మిలిటెంట్ల చెర నుంచి రుబియాను విడిపించడానికి భారత ప్రభుత్వం నలుగురు మిలిటెంట్లను విడుదల చేయాల్సివచ్చింది.
మెహబూబా ముఫ్తీ.. కశ్మీర్ సీనియర్ రాజకీయ నాయకుడు ముఫ్తీ మొహమ్మద్ సయీద్ కుమార్తె. ఈమె రాజకీయ ప్రస్థానం 1996లో ప్రారంభమైంది. మెహబూబా.. బిజ్‌బిన్హరా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీచేసి గెలిచారు.
59 సంవత్సరాల మెహబూబా ముఫ్తీ ఎల్ఎల్‌బీ చదివారు. కశ్మీర్ వివాదం గురించి, తమ పార్టీ విధానాల గురించి ఓసారి మీడియాతో మాట్లాడుతూ..
‘‘కశ్మీర్ వివాద పరిష్కారానికి పాకిస్తాన్‌తో, హురియత్‌తో చర్చలు జరపడం ద్వారా కొత్త ద్వారాలను తెరవాలి. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం రద్దు, పవర్ ప్రాజెక్టును తిరిగి తీసుకురావడం.. ఇది పీడీపీ ఎన్నికల అజెండా కాదు, ఇదే మా ప్రాథమిక అజెండా. వీటికోసమే మేం నిరంతరం పనిచేస్తున్నాం’’ అన్నారు.
మెహబూబా గురించి మరిన్ని వివరాలు, విశేషాలను పై వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)