ట్రిపుల్ తలాక్ చట్టానికి ఏడాది

వీడియో క్యాప్షన్, ట్రిపుల్ తలాక్ చట్టానికి ఏడాది
ప్రచురణ

ట్రిపుల్ తలాక్ చట్టానికి ఏడాది నిండింది. ఇన్‌స్టెంట్ తలాక్‌ ఇప్పుడు నేరం. అంటే భర్త మూడుసార్లు తలాక్‌ అని చెప్పి భార్యకు విడాకులు ఇవ్వడం ఇప్పుడు చట్టపరంగా నేరం. భర్తకు జైలు శిక్ష విధించే అవకాశం కూడా ఈ చట్టం కల్పించింది.

అయితే, భర్తకు జైలు అనే నిబంధనను దుర్వినియోగం చేయొచ్చని, మనోవర్తి పొందడం భార్యకు కష్టంగా మారొచ్చనీ కొన్ని విపక్ష పార్టీలు, సామాజిక సంస్థలు నాడు ఈ చట్టాన్ని వ్యతిరేకించాయి. ఇది తమ ముస్లిం పర్సనల్ లాలో జోక్యం చేసుకోవడమేనని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అభిప్రాయపడింది. ఈ చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో 20 పిటిషన్లు దాఖలయ్యాయి.

అయితే, రాజకీయ, న్యాయపరమైన చర్చను పక్కనపెడితే, ఈ చట్టం ముస్లిం సమాజంలో ఎలాంటి మార్పులు తెచ్చింది? మహిళల జీవితాలను ఎంతవరకు మెరుగుపర్చింది? బీబీసీ ప్రతినిధి దివ్య ఆర్య అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)