రూ.10 లక్షలు వసూలు చేశారు.. వేరే మృతదేహం ఇచ్చారు-ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు ఆసుపత్రి నిర్వాకంతో ఒకరి మృతదేహానికి బదులు మరొకరి మృతదేహానికి అంత్యక్రియల జరిగే పరిస్థితి ఏర్పడిందని ఈనాడు పత్రిక ఒక కథనం రాసింది. చితికి నిప్పంటించబోతుండగా, అంబులెన్స్ డ్రైవర్ అసలు విషయం చెప్పడంతో అంత్యక్రియలు ఆపేసినట్లు ఈ కథనం పేర్కొంది.
నిజామాబాద్ జిల్లా గన్నారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కరోనాకు చికిత్స పొందుతూ మరణించారు. అయితే రూ.10లక్షలు కడితేనే మృతదేహం ఇస్తామంటూ ఆసుపత్రి యాజమాన్యం తేల్చి చెప్పడంతో చేసేదిలేక బంధువులు ఆ సొమ్మును చెల్లించారు. చివరి చూపుకోసం ప్రాధేయపడినా సిబ్బంది అంగీకరించకుండా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారని బంధువులు చెప్పినట్లు ఈ కథనం వెల్లడించింది.
అయితే ఆఖరి నిమిషంలో అంబులెన్స్ డ్రైవర్ పొరపాటు జరిగినట్లు చెప్పడంతో బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో రెండు సెకండ్లలో చితికి నిప్పంటిస్తారనగా డ్రైవర్ ఫోన్ చేశాడని, రూ.10లక్షలు తీసుకుని కూడా వేరే మృతదేహం ఇచ్చారని, ఇది ఆసుపత్రి నిర్లక్ష్యానికి పరాకాష్టని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దసరాకు ధరణి పోర్టల్
తెలంగాణలో సమగ్ర భూరికార్డులతో వచ్చే దసరాకల్లా ధరణి పోర్టల్ సిద్ధమవుతుందని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్వయంగా దీనిని ప్రారంభిస్తారని నమస్తే తెలంగాణ పత్రిక వెల్లడించింది.
దసరానాటికి పోర్టల్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాల్సిందిగా సీఎం ఆదేశించినట్లు ఈ కథనం వెల్లడించింది. అన్ని రకాల ఆస్తుల డేటాను అందులో పొందుపరచాలని, అవసరమైతే కొత్త సిబ్బంది నియమించి పనులు సాగించాలని ఆయన సూచించినట్లు పేర్కొంది.
ధరణి పోర్టల్ రావడానికి ముందే రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలను కూడా ఖరారు చేస్తామని కూడా ముఖ్యమంత్రి వెల్లడించినట్లు తెలిపింది. కొత్త రిజిస్ట్రేషన్‌లు కూడా పోర్టల్ ఆరంభం నుంచే మొదలవుతాయని, అప్పటి వరకు ఎలాంటి రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉండదని సీఎం స్పష్టం చేసినట్లు నమస్తే తెలంగాణ కథనం వెల్లడించింది.

ఫొటో సోర్స్, FACEBOOK/Daggubati Purandeswari
బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలిగా డీకే అరుణ- ప్రధాన కార్యదర్శిగా పురందేశ్వరి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నేతలకు కీలకమైన పదవులను కట్టబెడుతూ బీజేపీ కొత్త జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిందని సాక్షి పత్రిక రాసింది.
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ, ప్రధాన కార్యదర్శిగా పురందేశ్వరి, ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడిగా కె.లక్ష్మణ్‌ను బీజేపీ అధిష్టానం నియమించింది.
ఆపరేషన్ 2023లో భాగంగా బీజేపీ కొత్త కార్యవర్గాన్ని నియమించిందని, రెండు రాష్ట్రాల్లో పార్టీకి కొత్త శక్తిని ఇచ్చేందుకు ఈ నియామకం తోడ్పడుతుందని బీజేపీ పెద్దలు భావిస్తుస్తున్నట్లు సాక్షి కథనం పేర్కొంది.
అధిష్టానం ఇచ్చిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించడానికి కృషి చేస్తామని కొత్త నియమితులైన నేతలు వెల్లడించినట్లు సాక్షి పేర్కొంది.
కేసీఆర్ నన్ను ట్రాప్ చేశారు-డి.శ్రీనివాస్
తెలంగాణలో కాంగ్రెస్‌ను దెబ్బకొట్టేందుకు కేసీఆర్ తనను ట్రాప్ చేశారని టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ ఆరోపించినట్లు ఆంధ్రజ్యోతి ఒక కథనం ఇచ్చింది.
ఇతర పార్టీల నుంచి తన పార్టీలోకి వచ్చాక వారిని కేసీఆర్ గాలికి వదిలేశారని శ్రీనివాస్ ఆరోపించినట్లు ఈ కథనం వెల్లడించింది. తాను ప్రగతి భవన్ పేరును కూడా మర్చిపోయానని, గౌరవంలేనిచోటకు వెళ్లడం అనవసరమని తాను భావిస్తున్నానని డి.శ్రీనివాస్ వ్యాఖ్యానించినట్లు ఈ కథనం పేర్కొంది.
కాంగ్రెస్‌ను వీడటం తన తప్పిదమేనని ఆయన అంగీకరించారచు. బయటి నుంచి ఒత్తిళ్లు, కేసీఆర్ నుంచి పిలుపుల కారణంగానే తాను కాంగ్రెస్‌ను వీడాల్సి వచ్చిందని శ్రీనివాస్ అన్నారు.
కేకేకు గౌరవం దక్కుతుందోలేదో ఆయనకే తెలియాలని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. జగన్మోహన్‌రెడ్డి పాలన బాగుందన్న శ్రీనివాస్, భవిష్యత్తులో తిరిగి కాంగ్రెస్‌లోకి వస్తారా లేదా అన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు.
ఇవి కూడా చదవండి:
- కశ్మీర్ సమస్య పరిష్కారం కానిదే దక్షిణాసియాలో శాంతి అసాధ్యం: ఐక్యరాజ్యసమితిలో ఇమ్రాన్ ఖాన్
- ఐక్యరాజ్యసమితి అంటే ఏమిటి? అది ఏం చేస్తుంది?
- బంగారం వ్యాపారానికి ప్రొద్దుటూరు ఎలా కేంద్రంగా మారింది? ఈ ఊరిని రెండో ముంబై అని ఎందుకు అంటారు?
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
- వాడి పడేసిన 3 లక్షల కండోమ్‌లు రీసైకిల్ చేసి విక్రయించే ప్రయత్నం...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)























