శోభా నాయుడు: ప్రసిద్ధ కూచిపూడి నర్తకి కన్నుమూత - BBC Newsreel

ఫొటో సోర్స్, facebook/sobhanaidu
ప్రముఖ కూచిపూడి నర్తకి శోభా నాయుడు హైదరాబాద్‌లో అనారోగ్యంతో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మరణించారు. పద్మావతి పాత్రలో ఆమె కనిపించే శ్రీనివాస కళ్యాణం నృత్య రూపకం నాట్య ప్రియులకు అత్యంత ప్రీతి పాత్రమైనది.
అలాగే, శ్రీ కృష్ణ పారిజాతంలో సత్యభామ పాత్ర కూడా ఆమె నటించిన పాత్రలలో బాగా పేరు సంపాదించుకున్నారు. ఆమెకు దేశవిదేశాలలో శిష్యులున్నారు. ఆమె కూచిపూడి నృత్య ప్రతిభకు గాను భారత ప్రభుత్వం పద్మ శ్రీ పురస్కారం ప్రదానం చేసింది.
ఆమె వెంపటి చిన సత్యం దగ్గర నృత్యం అభ్యసించారు. హైదరాబాద్ లో కూచిపూడి ఆర్ట్ అకాడమీని స్థాపించి పలువురు నృత్య కళాకారులకు శిక్షణ ఇచ్చేవారు. శోభానాయుడు అనగానే భామా కలాపం, శ్రీనివాస కళ్యాణం గుర్తు వస్తాయని ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ అసిస్టెంట్ డైరెక్టర్ నాగసూరి వేణు గోపాల్ అన్నారు.
ఆమె ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రాం అడ్వైజరీ కమిటీ సభ్యురాలిగా ఉండేవారని చెప్పారు. ఆమె డాన్సర్ మాత్రమే కాకుండా నృత్యంలో ఆమె పరిశోధకురాలు కూడా అని అన్నారు. ఆమెలో ఇసుమంత కూడా గర్వం కనిపించదని శోభా నాయుడుతో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆమె ఆల్ ఇండియా రేడియో కోసం అన్నమయ్య పద గోపురం అని కార్యక్రమం చేసినట్లు చెప్పారు. "కృష్ణను కలవడానికి సత్యభామ వెళ్లినట్లున్నారు" అని ఆమె స్నేహితురాలు దీపిక రెడ్డి బీబీసీ తెలుగుతో అన్నారు.
ఆమె జీవితాన్ని నృత్యానికే అంకితం చేసారని ఆమె అన్నారు. వారు తమ కళ ద్వారా ప్రజల మనసులలో ఎప్పటికీ నిలిచి ఉండిపోతారని అన్నారు.
కీసర మాజీ తహసీల్దారు నాగరాజు ఆత్మహత్య.. రూ.కోటి లంచం కేసులో జైలులో ఉండగా బలవన్మరణం

తెలంగాణలోని మేడ్చల్ జిల్లా కీసర మాజీ తహసీల్దారు నాగరాజు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న ఆయన అక్కడే ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
రూ. 1.10 కోట్ల లంచం కేసులో నిందితుడిగా ఉన్న ఆయన్ను కొద్దిరోజుల కిందట ఏసీబీ అరెస్ట్ చేసింది. ఆ కేసులో విచారణ కొనసాగుతుండగానే నాగరాజు ఆత్మహత్య చేసుకున్నారు.

ఏమిటీ కేసు..
ఈ ఏడాది ఆగస్టులో మేడ్చల్ జిల్లా కీసర తహసీల్దార్‌గా పనిచేసిన నాగరాజు రూ. కోటీ 10 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
కీసర మండలం రాంపల్లి దయారాలోని 28 ఎకరాల భూమిపై వివాదం నడుస్తుండగా, రియల్ ఎస్టేట్ సంస్థకు అనుకూలంగా పత్రాలు మార్చేందుకుగాను ఈ లంచం చేతులు మారినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
తహసీల్దారుతో పాటు ఈ వ్యవహారంలో పాల్గొన్న రియల్ ఎస్టేట్ బ్రోకర్, ఏజెంట్, వీఆర్ఏలను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- పీపీఈ కిట్ల పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులు దోచుకుంటున్నాయా...
- ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు సీరియస్... ఐసీయూలో ఉన్నారన్న ఎంజీఎం హాస్పిటల్
- 'జాతీయ ప్రతిజ్ఞ'ను స్కూలు పిల్లలు చదువుతున్నారని ఆ రచయితకు 25 ఏళ్ళ తరువాత తెలిసింది
- పాకిస్తాన్‌కు భారత్ కంటే ఒక రోజు ముందే స్వాతంత్ర్యం వచ్చిందా? అసలు నిజం ఏంటి?
- కమలా హ్యారిస్ ఎవరు? జో బిడన్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఆమెనే ఎందుకు ఎంచుకున్నారు?
- బాల గంగాధర్ తిలక్: కుల వివక్షను, స్త్రీల అణిచివేతను బలంగా సమర్థించారా?
- ఇండియా, ఇరాక్, బ్రిటన్, ఆస్ట్రేలియా.. అన్ని చోట్లా అమ్మోనియం నైట్రేట్ టెన్షన్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)























