కరోనావైరస్: కొందరిలో కోవిడ్ లక్షణాలు చాలాకాలం ఉంటున్నాయి ఎందుకు?

వీడియో క్యాప్షన్, కోవిడ్
ప్రచురణ

కరోనావైరస్ సోకిన వారిలో కొందరికి కోవిడ్-19 లక్షణాలు స్వల్పకాలమే ఉండి, త్వరగా కోలుకోగలుగుతున్నారు. కానీ కొందరిలో కరోనావైరస్ లక్షణాలు దీర్ఘకాలం కొనసాగుతున్నాయి. నెలల తరబడి అలసట, నొప్పులు, శ్వాస తీసుకోలేకపోవడంలాంటి ఇబ్బందులతో బాధపడుతున్నారు.

దీన్ని 'దీర్ఘకాలిక కోవిడ్' (లాంగ్ కోవిడ్) అని వ్యవహరిస్తున్నారు. ఇలా దీర్ఘకాలం కొనసాగుతున్న లక్షణాలతో చాలామంది బలహీనపడుతున్నారు. కొంచంసేపు నడిచినా కూడా తీవ్రమైన అలసట వస్తోందని అంటున్నారు. ఇటువంటి దీర్ఘకాలిక కోవిడ్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

ఇంతవరకూ కోవిడ్ సోకినవారి ప్రాణాలు కాపాడడంపైనే దృష్టి కేంద్రీకరించారు. కానీ ఇప్పుడు దీర్ఘకాలికంగా కొనసాగుతున్న కరోనావైరస్ లక్షణాలపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని గుర్తించారు.

అయితే, కొంతమందిలో ఎందుకు కోవిడ్ లక్షణాలు దీర్ఘకాలికంగా కొనసాగుతున్నాయి? వీరు ఎప్పటికైనా పూర్తిగా కోలుకోగలుగుతారా? అనే ప్రశ్నలకు ఇంతవరకూ స్పష్టమైన జవాబు లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)