కరోనా రోగుల సేవలో నిమగ్నమై ఈ నర్సు తన కాలునే కోల్పోయారు

ఫొటో సోర్స్, Mercury press
కరోనా విధుల్లో ఉన్న ఒక నర్సు తీవ్రంగా వేధిస్తున్న కాలు నొప్పిని పట్టించుకోలేదు. రోగుల సేవలు అందించడం ముఖ్యం అనుకున్నారు. తర్వాత ట్యూమర్ ఉన్నట్లు పరీక్షల్లో బయటపడడంతో కాలు తొలగించారు.
సల్ఫార్డ్ రాయల్ ఆస్పత్రిలో పనిచేసే 26 ఏళ్ల సెట్టే బ్యూనావెంచురా తన కుడి కాలి పిక్కలో నొప్పిగా అనిపించినా 8 వారాలపాటు ఆ బాధను అసలు పట్టించుకోలేదు.
తర్వాత ఏప్రిల్‌లో ఆమె కాలికి తీసిన స్కానింగ్‌లో సర్కోమా ఉన్నట్లు బయటపడింది. దాంతో మోకాలి పైవరకూ ఆమె కుడి కాలు తొలగించారు.
“ఒక నర్సుగా పనిచేస్తున్నప్పుడు మనం మన బాధల్ని మర్చిపోవాలి. ఎందుకంటే, మనం వేరే వాళ్లకు సాయం చేస్తూ బిజీగా ఉంటాం. కానీ, దానిని అంత నిర్లక్ష్యం చేసి ఉండకూడదేమో” అని ఆమె అన్నారు.
ఎకిల్స్‌కు చెందిన బ్యూనావెంచురా కాలు నొప్పి వల్ల నడడానికి కూడా ఇబ్బంది పడ్డారు. కానీ, ఆస్పత్రిలో రోజంతా నిలబడడం వల్లే అలా ఉందేమో అనుకున్నారు.
“కోవిడ్-19 వల్ల మా పని చాలా పెరిగింది. మాకు మా బాధలు, నొప్పుల గురించి ఆలోచించే సమయమే లేదు” అంటారు బ్యూనావెంచురా.
“మా అవసరం ఉన్న ప్రతి ఒక్కరికీ సాయం అందించేందుకు మేం అక్కడ ఉండాలి. ఆ స్థాయి నిబద్ధతకు నేను ఫలితాన్ని అనుభవించాను”
“ఆస్పత్రుల్లో పనిచేస్తుంటే అలాగే ఉంటుంది. మన నొప్పులను మనం మర్చిపోతాం. ఎందుకంటే మనం వేరే వాళ్లకు సాయం చేయడంలో బిజీగా ఉంటాం. అలా చేయడం నాకు ఇష్టం. కానీ ప్రతిదానికీ మూల్యం చెల్లించాలి” అన్నారు.

ఫొటో సోర్స్, Mercury press
గోల్ఫ్ బాల్ సైజులో కణితి
కుడి కాలులో కణితి ‘గోల్ఫ్ బాలు’ సైజులో పెరిగిందని, కాలు తీసేయకపోతే తన ప్రాణాలకే ప్రమాదం ఉండేదని ఆమె చెప్పారు.
”మీ కాలు తీసేయాలని వాళ్లు నాకు చెప్పినపుడు, నేను చాలా అప్‌సెట్ అయ్యా. కానీ, నాకు దాని గురించి ఆలోచించే సమయం లేకపోవడంతో అందుకు సిద్ధమయ్యాను” అని బ్యూనావెంచురా తెలిపారు.
“నన్ను నేను చూసుకోడానికి, ఆరోగ్యంగా ఉండడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. ఆరోగ్య సంరక్షణ రంగంలో పనిచేసే నేను, నాకే ఇలా అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు”.
బ్యూనావెంచురాకు ఇప్పుడు కృత్రిమ కాలు అమర్చారు. నవంబరులో తిరిగి విధులకు వెళ్లగలనని ఆమె అనుకుంటున్నారు.
తన అనుభవం నుంచి అందరూ పాఠం నేర్చుకోవాలని బ్యూనావెంచురా చెబుతున్నారు.
“ఎవరికైనా దీర్ఘకాలిక నొప్పి ఉంటే, వెంటనే దానికి పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. నేను దీన్ని త్వరగా గుర్తించి ఉంటే, ఇప్పుడు బహుశా వేరే స్థితిలో ఉండేదాన్ని” అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
- ఆల్ఫ్స్ పర్వతాలపై భారతీయ పత్రికలు, 1966 విమాన ప్రమాదం నాటివేనా
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- కరోనావైరస్: ఇండియా గ్లోబల్ హాట్‌స్పాట్‌గా మారిపోతుందా?
- భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?
- ‘ఉద్యోగం పోయింది.. అందుకే నా సెక్సీ ఫోటోలు అమ్ముకుంటున్నా’
- హైదరాబాద్ నుంచి ఇప్పటివరకు ఎంతమంది వెళ్లిపోయారు
- చైనా, ఇరాన్‌ల సీక్రెట్ డీల్: భారత్‌కు ఎంత నష్టం
- భారతీయ భార్య - చైనా భర్త.. వారిద్దరికీ ఓ కూతురు... వారి జీవితం ఇప్పుడెలా మారింది?
- విటమిన్-డి తీసుకుంటే వైరస్ రాకుండా కాపాడుతుందా
- 2 వేల సంవత్సరాల పురాతన అస్థిపంజరం.. మర్డర్ మిస్టరీలా ఉందంటున్న శాస్త్రవేత్తలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)























