ఆంధ్రప్రదేశ్: అర్నబ్ తుపాను సహాయక చర్యల కోసం 20 జిల్లాలకు రూ.27 కోట్ల నిధులు
ఆంధ్రప్రదేశ్‌లో అర్నబ్ తుపాను సహాయక చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం 20 జిల్లాలకు రూ.27 కోట్ల నిధులు విడుదల చేసింది.
సారాంశం
తూర్పు మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం సోమవారం తుపానుగా, మంగళవారం తీవ్ర తుపానుగా మారొచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తుపాను కారణంగా మంగళ, బుధవారాల్లో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు.
ఆదివారం రాత్రి 11.30 గంటల సమయానికి తీవ్ర వాయుగుండం విశాఖపట్నానికి 800 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది.
బ్రెజిల్లో లూలా డ సిల్వా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
లూలా అధ్యక్ష ఎన్నికల్లో గెలవడం ఇది నాలుగోసారి. ఇంతకుముందు 2003, 2010, 2023 ఎన్నికల్లో ఆయన గెలిచారు.
లైవ్ కవరేజీ
ఆంధ్రప్రదేశ్: అర్నబ్ తుపాను సహాయక చర్యల కోసం 20 జిల్లాలకు రూ.27 కోట్ల నిధులు
ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, హుద్‌హుద్ తుపాను సమయంలో కూలిన చెట్లు(ఫైల్ ఫోటో)
ఆంధ్రప్రదేశ్‌లో
అర్నబ్ తుపాను సహాయక చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం 20 జిల్లాలకు రూ.27 కోట్ల
నిధులు విడుదల చేసింది.
బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అనకాపల్లి జిల్లాలకు రూ.2 కోట్ల చొప్పున నిధులు విడుదల
చేశారు.
శ్రీకాకుళం,
మార్కాపురం, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, అల్లూరి, పోలవరం, మన్యం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీసత్యసాయి, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు
రూ.కోటి చొప్పున నిధులు మంజూరు చేస్తూ విపత్తుల నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ జి.
సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
‘బ్రెజిల్ ఎప్పటికీ లొంగదు’ అన్న లూలా డ సిల్వా గెలుపు అమెరికాకు ఎలాంటి సందేశం?
ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, ఇది చారిత్రక విజయమని బ్రెజిల్‌లోని అనేక వార్తా సంస్థలు పేర్కొన్నాయి.
బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష నాయకుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా విజయం సాధించారు.
ఈ విజయంతో 80 ఏళ్ల వర్కర్స్ పార్టీ అధినేత నాలుగోసారి బ్రెజిల్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్నారు.
రెండో రౌండ్ అధ్యక్ష ఎన్నికల్లో ఆయన తన ప్రత్యర్థి, రైట్ వింగ్ లిబరల్ పార్టీ నాయకుడు ఫ్లావియో బోల్సోనారోపై స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు.
లాటిన్ అమెరికాలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన బ్రెజిల్లో ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి లులాకు 51.76 శాతం ఓట్లు వచ్చాయి.
జైల్లో ఉన్న మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో కుమారుడు ఫ్లావియో బోల్సోనారోకు 48.24 శాతం ఓట్లు లభించాయి.
పార్లమెంట్‌కు సమీపంలో నార్త్ బ్లాక్‌లో కమ్ముకున్న దట్టమైన పొగ– వెల్డింగ్ పనుల కారణంగా చెలరేగిన మంటలు
ఫొటో సోర్స్, @milinddeora
ఫొటో క్యాప్షన్, పార్లమెంట్‌కు సమీపంలో నార్త్ బ్లాక్‌లో కమ్ముకున్న దట్టమైన పొగ
పార్లమెంట్‌కు సమీపంలో నార్త్‌బ్లాక్‌లో సోమవారం ఒక్కసారిగా దట్టమైన పొగ కమ్ముకుంది.
“పార్లమెంట్‌కు వెళ్తున్నప్పుడు,
నార్త్‌బ్లాక్ వెనుకాల దట్టమైన పొగను గమనించాను. అక్కడ అగ్ని ప్రమాదం జరిగిం ఉండొచ్చని
అనుమానం వచ్చింది. అంతా క్షేమంగా ఉంటారని భావిస్తున్నాను. అత్యవసర సిబ్బంది వేగంగా
స్పందించాలని కోరుకుంటున్నాను” అని బీజేపీ ఎంపీ
మిలింద్ డియోరా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు.
“దిల్లీలోని
నార్త్‌బ్లాక్‌లో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. ఓ భవనంలోని చిల్లర్ ప్లాంట్‌లో
ఉపయోగించే ఫైబర్ ట్యాంక్‌కు మంటలు అంటుకున్నాయి. దీంతో నల్లటి పొగ భారీగా
వ్యాపించింది. దీంతో సమీపంలోని ప్రజలు కొద్దిసేపు ఆందోళనకు గురయ్యారు” అని హిందూ పేర్కొంది.
నార్త్‌బ్లాక్‌లో
వెల్డింగ్ వర్క్ చేస్తుంటే చిన్న అగ్ని ప్రమాదం జరిగింది. వెల్డింగ్ నుంచి వచ్చిన
నిప్పు రవ్వలు సమీపంలోని ట్యాంక్‌కు వ్యాపించి మంటలు చెలరేగి పొగ వ్యాపించింది అని
ఏఏఎన్ఎస్
పేర్కొంది.
ఘటన
జరిగిన వెంటనే మంటలను ఆర్పేశారు. కొన్ని ప్రాంతాల్లో రాకపోకలను పునరుద్ధరించారు. ఎవరూ
గాయపడినట్టు రిపోర్ట్ కాలేదు.
సోమవారం
11 గంటలకు అగ్ని ప్రమాదం సమాచారం అందింది.
సమాచారం వచ్చిన వెంటనే ఘటనా స్థలానికి 6 ఆగ్నిమాపక యంత్రాలను పంపి మంటలను అదుపు చేసినట్టు
దిల్లీ ఫైర్ డిపార్ట్మెంట్ చెప్పింది.
రాహుల్ గాంధీ కాన్వాయ్‌కు ప్రమాదం
ఫొటో సోర్స్, Dilip Yadav
ఫొటో క్యాప్షన్, పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ రహదారిపై రాహుల్ గాంధీ కాన్వాయ్‌కు ప్రమాదం
ఉత్తరప్రదేశ్‌లోని
పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ రహదారిపై రాహుల్ గాంధీ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది.
ఆయన కాన్వాయ్‌లోని వాహనాలే ఒకదానికొకటి ఢీకొన్నాయి.
అందరూ
క్షేమంగా ఉన్నారని పవన్ ఖేరా చెప్పినట్టు బీసీసీ ప్రతినిధి ప్రేరణ తెలిపారు.
చాలా స్వల్ప
ప్రమాదమని, ఎవరికీ ఎలాంటి తీవ్రమైన గాయాలు కాలేదని న్యూస్ ఏజెన్సీ పీటీఐ
పేర్కొంది.
రాహుల్
గాంధీ లఖ్‌నవూ నుంచి సుల్తాన్పూర్ వెళ్తుండగా హాలియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదం
జరిగిందని ఐఏఎన్ఎస్ రిపోర్టు చేసింది.
ప్రమాదంలో కారు బానెట్ ధ్వంసమైనట్టు వివరించింది.
ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ రాహుల్ గాంధీ వెంటనే వేరే వాహనంలో సుల్తాన్పూర్
వెళ్లినట్టు తెలిపింది. ఎంపీ-ఎంఎల్ఏ కోర్టు ముందు హాజరయ్యేందుకు రాహుల్ వెళ్తుండగా
ప్రమాదం జరిగింది.
న్యూజీలాండ్‌తో జరిగే మూడో టీ20కి ఇషాన్ కిషన్ దూరం
ఫొటో సోర్స్, AFP via Getty Images
ఫొటో క్యాప్షన్, న్యూజీలాండ్‌తో జరిగే మూడో టీ20కి ఇషాన్ కిషన్ దూరం
తొడ కండరాలు పట్టేయడంతో న్యూజీలాండ్‌తో
జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌కి కూడా ఇషాన్ కిషన్ దూరంకానున్నట్టు బీసీసీఐ
ప్రకటించింది.
న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లోని తొలి టీ20
మ్యాచ్‌లో కుడి తొడ కండరాలు గాయంతో రెండో టీ20కి దూరమయ్యాడు. ఆయన స్థానంలో వైభవ్ సూర్యవంశీ
ఆడాడు. రెండో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన వైభవ్ ఆకట్టుకోలేకపోయాడు.
ఇషాన్ కిషన్ ప్రస్తుతం
కోలుకుంటున్నాడని బీసీసీఐ తెలిపింది. అతను ఇంకా మ్యాచ్ ఆడే స్థాయికి పూర్తి ఫిట్నెస్
సాధించలేదని వెల్లడించింది. అందుకే అక్టోబర్ 27న వెల్లింగ్టన్లో జరగనున్న మూడో
టీ20 మ్యాచ్‌కు దూరమవుతున్నట్టు పేర్కొంది. బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఇషాన్
కోలుకుంటున్నాడని చెప్పింది. కుమార్ కుశాగ్ర మూడో టీ20 మ్యాచ్‌లో ఆడతాడని
వెల్లడించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ‘అర్నబ్’ తుపానుగా మారినట్టు ఐఎండీ ప్రకటన
ఫొటో సోర్స్, @Indiametdept
ఫొటో క్యాప్షన్, బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ‘అర్నబ్’ తుపాను మారినట్టు ఐఎండీ ప్రకటన
తూర్పు-మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని
ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి ‘అర్నబ్’తుపానుగా మారిందని
ఐఎండీ ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్,
యానాం, దక్షిణ ఒడిశా తీరాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
ఈరోజు (అక్టోబర్ 26) ఉదయం 5:30 గంటలకు
తుపాను 15.4° ఉత్తర అక్షాంశం,
88.9° తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమై ఉందని ప్రకటించింది. శ్రీ విజయపురం
(అండమాన్ దీవులు)కు వాయువ్య దిశలో 590
కిలోమీటర్ల దూరంలో, ఒడిశాలోని గోపాలపూర్‌కు ఆగ్నేయ దిశలో 610 కి.మీ దూరంలో, విశాఖపట్నానికి
తూర్పు-ఆగ్నేయ దిశలో 650 కి.మీ దూరంలో, కాకినాడకు తూర్పు-ఆగ్నేయ దిశలో 730 కి.మీ దూరంలో, మచిలీపట్నానికి
తూర్పు దిశలో 830 కి.మీ దూరంలో, బాపట్లకు తూర్పు దిశలో 910 కి.మీ దూరంలో ఉంది.
మరింత బలపడనున్న తుపాను
అర్నబ్ తుపాను పశ్చిమ-వాయువ్య దిశగా
కదులుతూ ఈ అర్ధరాత్రి నాటికి తీవ్ర తుపానుగా, అక్టోబర్ 27 నాటికి అత్యంత తీవ్ర తుపానుగా మారే
అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అక్టోబర్ 28 ఉదయం బాపట్ల- విశాఖ మధ్య తీరాన్ని దాటే
అవకాశముంది.
తీరాన్ని దాటే సమయంలో గంటకు 115
నుంచి 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. అలాగే ఈదురుగాలుల
వేగం 140 కిలోమీటర్ల వరకు చేరే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
బ్రెజిల్ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన లులా డా సిల్వా, మూడు వారాల్లోనే మారిన ఫలితం
ఫొటో సోర్స్, EPA/Shutterstock
ఫొటో క్యాప్షన్, బ్రెజిల్ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన లులా డా సిల్వా
బ్రెజిల్‌కు చెందిన సీనియర్ వామపక్ష నేత,
ప్రస్తుత అధ్యక్షుడు లుయిజ్ ఇనాసియో లులా డా సిల్వా మరోసారి అధ్యక్షుడిగా
ఎన్నికయ్యారు. తీవ్ర పోటీ, పరస్పర విమర్శల మధ్య సాగిన ఎన్నికల్లో ఆయన తన రైట్‌వింగ్ ప్రత్యర్థి ఫ్లావియో బోల్సోనారోను ఓడించి పీఠాన్ని కైవశం చేసుకున్నారు.
లులా అధ్యక్ష
ఎన్నికల్లో విజయం సాధించడం ఇది నాల్గోసారి. ఆయన 2003 జనవరి నుంచి 2010 డిసెంబర్
వరకు వరుసగా రెండు సార్లు బ్రెజిల్ అధ్యక్షుడిగా పని చేశారు. అనంతరం 2003జనవరిలో
మళ్లీ అధ్యక్ష పదవి చేపట్టారు. ఇప్పుడు నాల్గోసారి గెలుపొందారు.
అయితే,
ఆదివారం జరిగిన తుది దశ ఓటింగ్‌లో లులా గెలుపొందడం అంత సులభంగా జరగలేదు. చాలా ఒడిదుడుకులు,
సవాళ్లను ఎదుర్కొని ఈ విజయం సాధించారు.
అక్టోబర్
4న జరిగిన తొలి దశలో లులాపై బోల్సోనారో ఆధిక్యం సాధించారు. అయితే కేవలం మూడు వారాల్లోనే
ఆ ఫలితాన్ని తలకిందులు చేసి లులా విజయం సాధిస్తారని అంచనాలు లేవు.
లాటిన్
అమెరికాలో ఇటీవల కనిపిస్తున్న రాజకీయ ధోరణికి భిన్నంగా కూడా లులా విజయం సాధించారు.
అక్కడి ఓటర్లు అధికారంలో ఉన్న నేతలను తిరస్కరిస్తూ, మితవాద పార్టీలకు మద్దతు
ఇస్తున్నారు. అర్జెంటీనా, చిలీ, కొలంబియా వంటి దేశాల్లో ప్రస్తుతం కన్జర్వేటివ్
నేతలే అధికారంలో ఉన్నారు.
లులా ఒక మాజీ
మెటల్ వర్కర్. ఆయన 1989లో తొలిసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. అప్పటి నుంచి
వామపక్ష రాజకీయాల్లో ప్రధాన నాయకుడిగా ఉంటూ వచ్చారు. 2003లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యేనాటికి
ఆ దేశం చాలా సవాళ్లను ఎదుర్కొంటోంది.
ఇప్పుడు
ఆయన పదవీ కాలం 2027 జనవరి 5 న ప్రారంభంకానుంది. ఇప్పుడు కూడా ఆయనకు అనేక సవాళ్లు ఎదురుకానున్నాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తో ఉన్న
విభేదాలు ఆయనకు ఎదురయ్యే ప్రధాన ఛాలెంజ్.
రెండు రోజులు ప్రయాణాలు వద్దు- తుపాను ప్రభావిత ప్రాంత ప్రజలకు అధికారుల విజ్ఞప్తి
ఫొటో సోర్స్, NurPhoto via Getty Images
ఫొటో క్యాప్షన్, తుపాను ప్రభావిత ప్రాంత ప్రజలకు అధికారులు పలు సూచనలు చేశారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు మంగళ, బుధవారాల్లో ప్రయాణాలు వాయిదా
వేసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు.
మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని స్పష్టం చేశారు. బోట్లు, వలలను సురక్షిత ప్రాంతాల్లో కట్టి ఉంచుకోవాలన్నారు.
విశాఖకు
దాదాపు 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న తీవ్ర వాయుగుండం రేపు, ఎల్లుండి తీవ్ర తుపానుగా
మారుతుందని, సుమారు 125 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయొచ్చని జైన్
హెచ్చరించారు. అందుకే ప్రయాణాలు పెట్టుకొవద్దని సూచించారు.
సోమవారం రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ
తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మంగళ, బుధవారాల్లో కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని
తెలిపారు. విశాఖ, అనకాపల్లి, కాకినాడ,
కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,
ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్,
నెల్లూరు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని
పేర్కొన్నారు.
బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి,
అనకాపల్లి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు, పోలవరం,
విశాఖ, కాకినాడ, కోనసీమ,
తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు,
కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు,
బాపట్ల, పల్నాడు, మార్కాపురం,
ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
‘అతి తీవ్ర తుపానుగా మారొచ్చు’.. విశాఖపట్నానికి 820 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండంపై అధికారుల హెచ్చరిక
ఫొటో సోర్స్, @Indiametdept
ఫొటో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్‌కు 820 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం ఇవాళ తుపానుగా మారే అవకాశం
తూర్పు మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలోని
తీవ్రవాయుగుండం ఇవాళ తుపానుగా, రేపు తీవ్ర తుపానుగా మారబోతోంది.
ఇది యానాం- బాపట్ల,
విశాఖ పట్నానికి మధ్య అక్టోబర్ 28వ తేదీన తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ
ప్రకటించింది.
ప్రస్తుతానికి ఈ తీవ్ర వాయగుండం 15 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది.
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఆదివారం(అక్టోబర్ 25) రాత్రి
ప్రకటించిన సమాచారం ప్రకారం.. ప్రకారం తీవ్ర వాయుగుండం విశాఖకు 820
కి.మీ., కాకినాడకు 910
కి.మీ., మచిలీపట్నానికి 1010 కి.మీ.,బాపట్లకు 1080
కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది.
ఈ తీవ్రవాయుగుండం సోమవారం(అక్టోబర్ 26) ఉదయానికి తుపానుగా, మంగళవారం(అక్టోబర్ 27) ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా,బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందే సూచనలు ఉన్నాయని
విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
ఇది తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే
అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నిరంతరం తుపాను పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని..
ప్రజలు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
గుడ్ మార్నింగ్
బీబీసీ
న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లకు స్వాగతం.
నేను
బీబీసీ ప్రతినిధి ఖగేష్, మధ్యాహ్నం
2 గంటల వరకు ముఖ్యమైన వార్తలను మీకు
అందిస్తాను.